Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ శక్తులకే వత్తాసు..
- ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ప్రజాసమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఏసీరెడ్డినగర్లోని రఘునాథ్భవన్లో పార్టీ శాఖ మహాసభను కోటి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రత్నమాలలు ముఖ్యఅతిథులుగా హాజరై జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందిందని తెలిపారు. ఆయోద్య రామ మందిరం పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు పూనుకుంటుందని, వాటిని రద్దు చేయాలని రైతులు, కార్మికులు పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజానీకం యిబ్బందులు ఎదుర్కొంటున్నదని వాపోయారు. కరోనా నివారణలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందని పేర్కొన్నారు. అందరికీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంచలేకపోయిందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, జర్నలిస్టులు, హక్కుల, సంఘాల మీద నిఘాను పెట్టిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్, పెట్టుబడి దారుల లాభాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటికరిస్తోం దని మండిపడ్డారు. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నూతన శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సుతారి సారంగపాణి, శాఖ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు, నాయకులు దుర్గయ్య, ఆవుల ఉదరు, యాకన్న, దౌలత్ రవి, ఎన్ సునీత, రాధమ్మ, యాకమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.