Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి
నవతెలంగాణ-తాడ్వాయి
నేటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడె నాగజ్యోతి కోరారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచం మొత్తంగా 476 మిలియన్ల జనాభా ఉండగా వివిధ రకాల తెగలు ఏడు వేల భాషల్లో మాట్లాడుతారని, ఇందులో రెండు వేల ఆరు వందల ఎనభై భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ మొత్తంలో వివిధ రకాల భాష సంస్కతి సంప్రదాయాలను కాపాడాలన్నారు. ఇందులో భాగంగా 1972లో 179 దేశాల ప్రజాప్రతినిధులు ఆదివాసీల రక్షణ కోసం ప్రణాళికలు చేసి వారి రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి వర్కింగ్ గ్రూప్లో సమావేశం నిర్వహించగా ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇంటింటికి, గూడేల్లో ఆదివాసీ జెండా ఎగరేయాలని కోరారు. అదివాసీల కోసం రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లో 65 షెడ్యూల్ సంస్కతి సంప్రదాయాలు విద్య, భాష, రక్షణ అభివద్ధి కోసం ప్రత్యేకంగా చోటు కల్పించినట్టు తెలిపారు. ఆదివాసీలందరూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.