Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలో క్విట్ట్ ఇండియా ఆగస్టు 9 భారత్ రక్షణా దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయు, రైతు సంఘం, వ్యకాస ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఆదివారం రక్షణ వివాస్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య సీఐటీయు జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూల నిర్ణయాలు చేస్తూ పేద మధ్యతరగతి కార్మిక రైతాంగానికి వ్యతిరేక నిర్ణయాలను చేస్తుందని ఈ నిర్ణయాలను ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారత్ రక్షణా దినం దేశభక్తి యుత ఉద్యమంలో ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్యవాదులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని బిజెపి నరేంద్ర మోడీ విధానాలని వెనక్కి కొట్టడమే కాక రాబోయే కాలంలో లో దేశ ప్రజలకు నష్టదాయకమైన నిర్ణయాలు దేశపౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా దొంగిలించి విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ దేశ యువతను పకోడీ చారు కొట్టులు పెట్టుకోమని యువత ఎదుగుదలను ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా దేశ ప్రధాని మాట్లాడడం యువతను అవమానించడమేనని విమర్శించారు గత రెండు సంవత్సరాలుగా కరోనా దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజల ఉపాధి దెబ్బ తీస్తుంటే మోడీ ప్రభుత్వం విదేశీ స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు దేశ తలపుల్ని బార్లా తెరిచి దేశ సంపదను దోచి పెడుతుందని రోజంటికి దేశంలో పేదరికం అంతకంతకు పెరుగుతుంటే 10 శాతం ఉన్న పెట్టుబడిదారుల ఆస్తులు రెండింతలు పెరిగాయని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగితే దేశం దివాలా తీయడం ఖాయమని అందుకే భారత్‌ను రక్షించుకోవాలని కోరారు కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు హనుమకొండ సంజీవ, కందికొండ రాజు, శ్రామిక మహిళా నాయకురాలు గుజ్జుల ఉమా, గడ్డమీది బాలకష్ణ, నాగమణి, లావణ్య, అంకిత తదితరులు పాల్గొన్నారు.