Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆనందయ్య కరోనాకు సంబంధించి ఇమ్యూనిటీ పవర్ పెంచే ఉచిత మందు పంపిణీ కార్యక్రమం మండలం లోని గాంధీ సెంటర్ క్రీడా మైదానంలో కష్ణపట్నం ఆనందయ్య కరోనా వ్యాధికి తట్టుకునే విధంగా మానవ శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచే విధంగా (ఇమ్యూనిటీపవర్ ) ఉచిత మందు పంపిణీ కార్యక్రమం గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దేశాయి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన వక్ష మిత్ర, మొక్కల ప్రేమికులు మొక్కల వెంకటయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ మందు వాడవచ్చునని తెలియపర్చారు. అలాగే మందు వాడకూడని వారు గర్భిణీ స్త్రీలు ఐదు సంవత్సరాలు చిన్న పిల్లలు మెన్సెస్ ఉన్న మహిళలు గర్భవతులు పిల్లల తల్లులు ఈ మందును వాడకూడదని తెలియపరిచారు. అదేవిధంగా మందు వేసుకునే వాళ్ళు ఉదయం పరగడుపున బఠాని గింజంత తీసుకోవాలి సాయంత్రం అన్నం తిన్న తర్వాత బఠాని గింజ అంతా తీసుకోవాలని ఈ విధంగా మూడు రోజులు వాడాలని తెలియపరచడం జరిగింది. అలాగే ఆయుర్వేద వైద్యులు రామంచి శ్రీనివాస్ మాట్లాడారు. మందు గుట్కా సిగరెట్ సంబంధించిన వాళ్ళు మందు వేసుకున్న వాళ్ళు మూడు వారాలు దాకా పత్యం పాటించాలని మటన్ చికెన్ తినకూడదు అని మందు తాగ కూడదు అని వివరించారు. కార్యక్రమంలో నుర్వి రాజశేఖర్, ముస్తాఫా, సుగుణారావు, చంద్రమౌళి, రాజు వెన్నెల, ముఖేష్, తదితరులు పాల్గొన్నారు.