Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
30 ఏండ్లుగా ప్రజాజీవితంలో తన వెంట నడిచిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాల పల్లి రూరల్ మండల ఏఐఎఫ్బీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తతస్థాయి సమా వేశం అంబాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఆస్తులను కాపాడడం కోసమే టీఆర్ఎస్లోకి వెళ్లాడని తెలిపారు. అభివద్ధి కోసమే టీఆర్ఎస్లోకి వెళ్లాలని చెప్పాడని అభివృద్ధి మాత్రం కనిపించడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. నియోజకవర్గంలో రెండున్నరేండ్లు గడుస్తున్నా అభివద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి పూర్తి అయి మూడేండ్లు గడుస్తున్నా 20 బెడ్లు వేసి నామమాత్రంగా వైద్య సదుపాయాలు అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి ఆసుపత్రిలో డాక్టర్లు నియమించాలని అసమర్ధుడు ఎమ్మెల్యే అని అన్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎకో పార్క్ ప్రారంభించ లేని దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని అన్నారు. నియోజకవర్గంలోని సీఎస్ఆర్ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిస్తు ప్రజాధనాన్ని దొంగలపాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడి నిధులను ఇక్కడనే ఖర్చు చేయాలని అన్నారు. నియోజకవర్గంలో ఖనిజ సంపదను స్థానిక ఎమ్మెల్యే దోచుకుంటున్నా రని విమర్శించారు. రాష్ట్రంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అన్నారు.2023 లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాఖీ పౌర్ణమి తర్వాత భూపాలపల్లికి టీపీసీసీ ధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆహ్వానించి సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుందన్నారు. 9న జరిగే ఇంద్రవెల్లి సభ అనంతరం భూపాలపల్లి సభ ఉంటుందని తెలిపారు. సుమారు 50 వేల మందికి పైగా జన సమీకరణ చేయాలని అన్నారు .కొత్త పాత తారతమ్య బేదాలు లేకుండా కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా రక్షణ కవచంలా అండగా ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి తన పాత క్యాడర్ ని మాత్రమే పదవుల్లో నియమించుకొని అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెండు సంవత్సరాలు కష్టపడండి ఆ తర్వాత గెలవగానే ఐదు సంవత్సరాలు నేను మీ కుటుంబ సభ్యునిగా పెద్దన్నగా మీకు పాలేరుగా పని చేస్తానని అన్నారు. ప్రజా సమస్యలే మన ఏజెండా ని పదవులు ముఖ్యం కాదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కషి చేశానని అన్నారు . రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ నాయకులు రామినేని రవీందర్, బుర్ర కొమురయ్య, పిప్పాల రాజేందర్, సంతోష్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.