Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు
- అధికారుల పర్యవేక్షణ శూన్యం
నవతెలంగాణ-తొర్రూరు
డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహిస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో డిగ్రీ కళాశాల సిబ్బంది ఒక్కో విద్యార్థి నుంచి రూ.3-5 వేలు వరకు వసూలు చేస్తూ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు విద్యా ర్థులు పరీక్ష హాలులోకి గైడ్స్, టెస్ట్ పేపర్లు, పుస్త కాలు తీసుకువెళ్లి యధేచ్చగా కాఫీ కొడుతున్నట్లు సమాచారం. ఆదివారం పరీక్ష కేంద్రానికి చుట్టూ స్లిప్పులు, పుస్తకాలు కనిపించాయి. ఈ సెంటర్లో మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తున్నట్లు తెలుసుకున్న విద్యార్థులు స్థానికులు కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ఈ సెంటర్‌కు వేయించుకుని పరీక్షలు రాస్తున్నట్లు తెలిసింది. ఈ తతంగమంతా ఓపెన్‌గా జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఈ సెంటర్‌పై పలు విమర్శలొచ్చినా పట్టించుకున్న దాఖలాల్లేవని విద్యార్థులు మండిపడుతున్నారు. డబ్బులు ఇచ్చిన విద్యార్థులందరినీ ఒక గదిలో, ఇవ్వని వారిని మరో చోట కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తురని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదేమిటని అడిగిన విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులుగా స్పందించి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.