Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ఫా న్యూమరో టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ శనివారం ప్రాంగణ నియామకాలు చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో జరిగిన ఈ నియామకాల్లో మొదటి రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూలో ట్రిపుల్ఈ, ఈసీఈ, ఈఐఈ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా కళా శాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కంపెనీ ఉద్యోగాలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ క్రాంతి కుమార్ ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను అందజేసి మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులు నిరంతరం సాంకేతిక నైపుణ్యాలను ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పెంచుకోవాలని కోరారు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైన ముందుకు సాగే గుణాలను ఇనుమడింప చేసుకోవాలని సూచించారు. మూల సాంకేతిక అంశాలపై దష్టి పెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు, కిట్స్ కళాశాల కరస్పాండెంట్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కోశాధికారి నారాయణరెడ్డి ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థినులను, నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి కోర్, సాఫ్టువేర్ కంపెనీలు కిట్స్ కళాశాలకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉద్యోగ సముపార్జనకు సిద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి శ్రావ్య, సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ విశ్వాంక్, సీనియర్ మేనేజర్ టెక్నికల్ లీడ్ చేతన్, సీనియర్ మేనేజర్ టెక్నికల్ లీడ్ హైమావతి, హెచ్ఆర్ అవినాష్, డైరెక్టర్ సేల్స్, అకాడమిక్ డీన్ డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ శ్రీకాంత్, ట్రెయినింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ చంద్రాబాయి, అన్వేష్‌కుమార్, ప్లేసెమెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజు, కళాశాల పీఆర్ఓ డాక్టర్ ప్రభాకరాచారి పాల్గొన్నారు.