Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-హన్మకొండ
గౌడ కులస్తులకు సముచిత న్యాయం కల్పిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ వినరుభాస్కర్ అన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని గౌడ హాస్టల్ సమావేశ మందిరంలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా గౌడసంఘం అధ్యక్షుడు జూలూరి రంజిత్ గౌడ్ అధ్యక్షతన వరంగల్ తూర్పు నియోజకవర్గం 61వ డివిజన్ కార్పొరేటర్ పోశాలపద్మ స్వామిగౌడ్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్ మాట్లాడారు. గౌడ కులస్థులు మొదటి నుంచి తన గెలుపు కోసం కషి చేస్తున్నారని తెలిపారు. గౌడ కులస్తులకు తప్పకుండా అభివృద్ధి ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలో చేపట్టనున్న రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా గౌడ కులస్తులకు న్యాయం చేస్తానని హామీ ఇ5చ్చారు. నిర్మాణంలో ఉన్న గౌడ హాస్టల్‌కు ప్రభుత్వ నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గౌడసంఘం జిల్లా నాయకులు బుర విద్యాసాగర్‌గౌడ్, తాళ్లపెల్లి జనార్ధన్‌గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, పులి శ్రీనివాస్, పులి మోహన్, తాళ్లపెల్లి రమేష్, శ్రీపతి గోపీ, తీగల లక్ష్మణ్, తాళ్లపెల్లి సురేష్, బొమ్మెర కుమార్ గౌడ్, పెరుమాండ్ల శంకర్, పంజల జ్ఞానేశ్వర్, పంజాల మధు, రమేష్, కోతి సాంబరాజు, సదానందం, నాగపూరి రమేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.