Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
బీఎస్పీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో నల్గొండ రాజ్యాధికార సంకల్ప సభకు మండలం నుంచి జనం సన్నద్ధమైనట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్సంపెల్లి ఉపేందర్ తెలిపారు. ఆదివారం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన మాట్లాడారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అధ్యక్షతన జరిగే సభలో తెలంగాణ గురుకులాల సంస్థ విశ్రాంత కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేరతారని తెలిపారు. సభకు ముఖ్యఅతిధిగా బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్ పాల్గొంటారని ఉపేందర్ తెలిపారు.. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం గా పని చేస్తామని ఆయన తెలిపారు... ఈ సభ ను 5 లక్షల మంది ప్రజలతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలోని సుమారు 16 మండలాల నుండి కార్యకర్తలు వెళ్లారని వారు తెలిపారు. కార్యక్రమంలో బోజ్జ ఉపేందర్. మహేష్, నాగరాజు, సురేష్, సతీష్, మహేందర్, బన్నీ, రమేష్, రాజశేఖర్, మురళి, చింటూ తదితరులు పాల్గొన్నారు.