Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ డైరెక్టర్ గుగులోతు బాలాజీనాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
అనాధ బాలలకు అండగా ఉంటామని నెల్లికుదురు సొసైటీ డైరెక్టర్ గుగులోతు బాలాజీ నాయక్ తెలిపారు. ఆదివారం నాన్కు కుటుంబాన్ని పరామర్శించి అనాధలైన పిల్లలకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకునేందుకు కషి చేస్తానని తెలిపారు. రతిరాంతండా గ్రామ అభివద్ధికి చొరవ తీసుకుంటానని చెప్పారు. మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహకారంతో మండలంలోని అన్ని రకాలుగా అభివద్ధి చేసేందుకు పాటు పడతానని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు వెంకన్న, పూల్య, సురేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.