Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-హన్మకొండ
ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే హుజరాబాద్ లో దళిత బంధువు పథకాన్ని అమలు చేస్తున్నారని దీన్ని వ్యతిరేకిస్తూ దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని ఆగస్టు 15లోగా హుజరాబాద్ లో అమలు చేయాలని 31లోగా రాష్ట్ర మంతటా అమలు చేసి 20 లక్షల దళిత కుటుంబాలకు రూ 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బిర్రు మహేందర్ మాట్లాడుతు.. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని మరో మోసపూరిత పథకంగా మార్చవద్దని అన్నారు. షరతులు లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు వేల్పుల సూరన్న, కల్లేపల్లి ప్రణరుదీప్ , మంద రాజు, కందికట్ల విజరు, గోపాల్, సురేందర్, బాబురావు, బిక్షపతి, మధు తదితరులు పాల్గొన్నారు.