Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
హన్మకొండలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి రామావత్ నరేష్‌నాయక్ అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదివాసీ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాలనీలోని గిరిజనులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేష్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, సంస్కతి సాంప్రదాయాలకు పరిరక్షణ స్వయం పాలనకు ఎందరో మహానీయులు త్యాగాలు చేశారన్నారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటు న్నామన్నారు. గిరిజన గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేక చీకటిలో మగ్గుతూ నివసిం చడానికి స్థలాలు, పక్కా గృహాలు లేక పూరిగుడిసెల్లో, పౌష్టికాహారం లేక, చదువుకు, సంపదకు ఆహారానికి, ఆరోగ్యానికి నోచుకోలేక బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఆసుపత్రికి వెళ్లేందుఉ రవాణా సౌక ర్యం లేక అల్లాడుతున్నారని అన్నారు. ఆదివాసులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై లేదా అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఆదివాసి గిరిజనులకు ఉచిత అత్యవసర చికిత్స అందిం చాలన్నారు. అనంతరం గిరిజన వృద్ధులను శాలు వాలతో సన్మానించారు. పార్టీ సీనియర్ నాయకులు మొక్కిరాల జనార్ధన్‌రావు, కందుకూరి నరేష్, సంపత్‌నాయక్, భానునాయక్, మేగ్యనాయక్, వంశీ నాయక్, యాకుబ్, విజరు, కోటేశ్వరరావు, అంజమ్మ, నిర్మల, అనిత, లక్ష్మీ, రజిత, తదితరులు, పాల్గొన్నారు.