Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
'జిల్లా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ తదితర పద్ధతులలో పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్ ,వాటర్ వర్క్స్, పార్కుల నిర్వహణ, ఆఫీస్ నిర్వహణతో పాటు వివిధ కేటగిరీల్లో పనిచేసున్నారు. వారందరికీ జమ్మికుంట మున్సిపాలిటీల్లో జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు ఇస్తున్నట్టు ఇక్కడి జిల్లా మున్సిపాలిటీ కార్మికులకు చెల్లించాలి.'అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ... రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లందరికీ వేతనాలు పెంచుతూ ప్రకటన చేశారన్నారు. జూన్ నెల నుండి పెరిగిన జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంట మున్సిపాలిటీ కార్మికులకు మాత్రమే పెరిగిన వేతనాలు ఇవ్వడం, మిగతా మున్సిపాలి టీలలో ఇవ్వకపోవడం దుర్మార్గమమైన చర్య అని మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారుర. ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని కోరారు. దళిత ఎన్ఫోర్స్మెంట్ పథకం కింద మున్సిపల్ లో పనిచేస్తున్న అర్హులైన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో సేవలందించిన మున్సిపల్ కార్మికులను విస్మరించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించ కుంటే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ యూనియన్ అధ్యక్షులు ఓరుగంటి రాజేందర్, నాయకులు సమ్మయ్య రాజు పోచయ్య, సుధాకర్, రవీందర్, రమేష్, సమ్మక్క, రజిత, పద్మ, మంజుల, తదితరులు పాల్గొన్నారు.