Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీశాఖ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీసీిఏప్) లోకేష్ జైస్వాల్
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలో అటవీ ప్రాంతంలో ఉన్న చిన్నతరహా ప్రాజెక్టుయిన బొగ్గులవాగు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అభివద్ధి చేస్తామని అటవీశాఖ ముఖ్య కార్యనిర్వాణ అధికారి (సిసిఏప్) లోకేష్ జైస్వాల్ అన్నారు. సోమవారం ఆయన అటవీశాఖ వరంగల్ సిసిఏప్ డాక్టర్ ఎస్ జె ఆశా, భూపాలపల్లి జిల్లా డీఎఫ్ఓ లావణ్య, ఏఫ్డీఓ కృష్ణ ప్రసాద్ లతో కలిసి గతంలో నిర్మించిన ఆడిటోరియం, బాత్ రూమ్లను పరిశీలించారు.బొగ్గులవాగు కట్టపై వాచ్ టవర్, సోలార్ తో హైమస్ లైటింగ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం రుద్రారం సెక్షన్ పరిధిలో ప్లాంటేషన్, చెక్ డ్యాంలు, ఏఎన్ఆర్ పనులు, పిడి కుంటలు, ఉపాధి కూలీలు తవ్వకాలు చేపట్టిన గుంతలు పరిశీలించి హర్షం వ్యక్తం చశారు. పనులు భేష్ గా ఉన్నాయని అభినందించారు వివిధ రకాల మొక్కల పెంపకం, అటవీ జంతువులకు నీటి కుంటల తదితర పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్యుర్ రేంజర్ కిరణ్ కుమార్,రుద్రారం,తాడిచెర్ల సెక్షన్ అధికారులు కొమురయ్య, శ్రీనివాస్ రెడ్డి, బిట్ అధికారులు పాల్గొన్నారు.