Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణంలోని ఎస్సీ బార్సు హాస్టల్‌ను ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సోతుకు ప్రవీణ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో లో హాస్టల్ విద్యార్థులతో కలిసి హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ డిగ్రీ పరీక్షలు నడుస్తున్న తరు ణంలో పట్టణంలోని ఎస్టీ, బీసీ హాస్టల్స్ ప్రారంభమై నప్పటికీ ఎస్సీ హాస్టల్ ఎందుకు ప్రారంభించటం లేదని అధికారులను ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెటుకుని హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని కోరారు. సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. వారికి హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. వెంటనే ఎస్సీ బార్సు హాస్టల్‌ని ప్రారంభించకుంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పోతుల పవన్, సాకేత్ రెడ్డి హాస్టల్ విద్యార్థులు దేవేందర్ గణేష్, అనిల్‌కుమార్, కొండయ్య, అశోక్, సురేంద్రచారి పాల్గొన్నారు.