Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
గ్రామాల్లోని దళిత వాడల్లో జరిగే అభివృద్ధి పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు సోమవారం మండల కేంద్రంలో సర్పంచ్ పూర్ణచందర్ ఆధ్వర్యంలో దళిత క్రాంతి పథకంలో భాగంగా గ్రామంలో ఉన్న మౌలిక వసతుల పట్ల సర్వే నిర్వహించారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సైడు కాలువలు, విద్యుత్ స్తంబాలు, కమ్యూనిటీహాల్ పలు అంశాల పట్ల సర్వే నిర్వ హించారు. జెడ్పీ సీఈఓ పాల్గొని పరిశీలించి మాట్లా డారు. దళిత క్రాంతి పథకాన్ని గ్రామాల్లో విస్తరింపజేసి అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి రామయ్య, పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ శంకర్రావు ఎలక్ట్రిసిటీ సబ్ ఇంజినీర్ వెంకట్, సంజరు, కారోబార్ అంతం సదానందం, తదితరులు పాల్గొన్నారు.