Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై క్విట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యమించి దేశాన్ని రక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ కోరారు. సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు, మోసపూరిత విధానాలతో దేశాన్ని దివాలా తీయిస్తోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఉద్యమాలను ఆంగ్లేయులను మరిపించేలా అణచి వేస్తోందంటూ బీజేపీ దురహంకార తీరును ఎండగట్టారు. ప్రభుత్వ రంగ బొగ్గు, రైల్వే, విద్యుత్, విమానాలు, ఓడరేవులు, స్టీల్, ఆయిల్ కంపెనీలతోపాటు విద్య, వైద్యం, రక్షణ రంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. కరోనా సంక్షోభంలో విలవిలలాడుతున్న ప్రజలు ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అదే సమయంలో నిత్యావసర సరుకుల ధరలను భారీగా పెంచి పేదలపై మోయలేని భారాలు మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేట్ సంస్థల ఆస్తులు 13 లక్షల కోట్ల పెరిగేలా దన్నుగా నిలిచిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు ప్రజామద్దతు అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం నాయకులు ఆకుల రాజు, అల్వాల వీరయ్య, గునగంటి రాజన్న, కుమ్మరికుంట్ల నాగన్న, రామ్మూర్తి, సమ్మెట రాజమౌళి, వాసం దుర్గారావు, హేమనాయక్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజరుకుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ, వ్యకాస జిల్లా నాయకులు బొల్లం అశోక్, యాకూబ్ మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి జమ్ముల శ్రీను, మార్గం సాంబయ్య, చిన్న బాబు, మార్బుల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఖాసిం, మాలోత్ రాజేందర్, రమేషు, వెంకన్న, దేవేందర్, హుస్సేన్, బాషా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో
సీపీఐ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఓమ భిక్షపతి, వ్యకాస నాయకులు గణపురం లక్ష్మన్, బందు మహేందర్, బానోతు నర్సింహ, అజ్మీర వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన తెలిపారు. అనంతరం తుడుసు యాదగిరి అధ్యక్షతన జరిగిన సభలో వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యుడు మండ రాజన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నంబూరి మధు మాట్లాడారు. కార్యక్రమంలో వల్లాల వెంకన్న, మోహన్, పెంటయ్య, వేణు, రవి, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ సయ్యద్ రఫీకి వినతిపత్రం అందించారు. సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడు మాట్లాడారు. కార్యక్రమంలో వ్యకాస, సీఐటీయూ, కేవీపీఎస్, రైతు సంఘం నాయకులు పెరుమాండ్ల తిలక్ బాబు గౌడ్, ఈసంపెల్లి సైదులు, పుల్లయ్య, బ్రహ్మయ్య, సత్యనారాయణ, ఎల్లయ్య, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ మండల కన్వీనర్ పొదల నాగరాజు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలకు వ్యతిరేకం గా సీపీఐ(ఎం) పోరాడుతోందని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్య క్షుడు పొదల దేవేందర్, వ్యకాస మండల నాయకుడు కడారి ఐలయ్య, సీఐటీయూ మండల నాయకుడు గంగాపురం మహేందర్, కేవీపీస్ మండల కార్యదర్శి శాగా సాంబరాజు, బంద రవీందర్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పొదల లవకుమార్, విజరు, రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం : మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వమించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా వ్యకాస జిల్లా ప్రదాన కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టెం ఆదినరాయణ, సీఐటీయూ మండల కార్యదర్శి కట్ల నర్సింహాచారి, గిరిజన సంఘం నాయకులు వంకా రాములు, కుమ్మరి శ్రీను, పూర్ణ, మల్లక్క, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపూర్ : సీఐటీయూ, రైతు సంఘం, వ్యకాస ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం నాయబ్ తహశీల్దార్ తజుఫాల్ హుస్సేన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో వ్యకాస మండల కార్యదర్శి పసుల కోటయ్య, రైతు సంఘం మండల నాయకుడు అటికె సాంబయ్య, సీఐటీయూ మండల నాయకులు యాట రఘు, తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్పూర్ : ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం మాట్లాడారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా నాయకుడు, ఎంపీటీసీ ఎన్నకూస కుమార్, రైతు సంఘం మండల కార్యదర్శి గట్ల మల్లారెడ్డి, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మునిగెల రమేష్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య, కేవీపీఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు చిలుముల్ల భాస్కర్, మంద మహేందర్, జీఎంపీఎస్ మండల కార్యదర్శి మ్యాదరబోయిన కరుణాకర్, ప్రజాసంఘాల మండల నాయకులు కత్తుల రాజు, సతీష్, శ్రీనివాస్, వెంకటేష్, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : వ్యకాస, సీఐటీయూ, రైతు సంఘం, తెలగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ విజరుభాస్కర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వ్యకాస, సీఐటీయూ, రైతు సంఘం జిల్లా నాయకులు సోమసత్యం, చిట్యాలసోమన్న, మాచర్ల సారయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాసంపల్లి నాగయ్య, బెళ్లిసంపత్, లావుడియా అనిల్ చౌహాన్, పనికర రాజు, ఓగ్గుల లక్ష్మణ్, బెళ్లి సతీష్, నక్క రవి, భాస్కర్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.