Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
పల్లెల్లో పోలీసుల నిఘా పెరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నేరాల, ప్రమాదాల నివారణ కోసం పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. ఎస్సై బి రాజేష్‌నాయక్ తనదైన శైలిలో ఇప్పటివరకు 83 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అధికారులు, దాతలు అందించిన విరాళాలతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందిస్తూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి న్యాయం చేస్తున్నట్టు చెప్పారు. ఫిర్యాదుదారుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు. సీసీ కెమెరాల వల్ల ప్రజలకు భద్రత లభిస్తుందని చెప్పారు. మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ మారుజోడు రాంబాబు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సోమవారం రఘునాథపల్లి రూ.50 వేలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్ గుప్తా, మండల రైతు కో-ఆర్డినేటర్ గొరిగె రవి, తదితరులు పాల్గొన్నారు.