Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
ముర్రుపాలు బిడ్డకు శ్రేష్ఠమని మండలంలోని గంగారం సర్పంచ్ గౌరబోయిన నాగేశ్వర్రావు తెలిపారు. మండలంలోని గంగారం పంచాయతీ పరిధిలోని బంజర ఎల్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పూనెం విజయ ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పిల్లలు, తల్లులు, గర్భవతులు, గ్రామస్తులతో భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నాగేశ్వర్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలింతలు, గర్భవతులకు అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్డు, బెల్లం, అటుకులు, రాగి పిండి, జొన్నపిండి, తదితర పౌష్టికాహారం అందిస్తున్నట్టు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. శిశువుకు ఆర్నెళ్ల వరకే కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. తద్వారా బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈసం వినోష, వార్డు సభ్యులు, గర్భవతులు, బాలింతలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.