Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్ఘడ్
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం తగదని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లెందుల బేబీ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ బేబీ శ్రీనివాస్ మాట్లాడారు. ఎమ్మెల్యే రాజయ్య షర్మిలతో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోకుండా గతంలో షర్మిలతో రాజయ్య కలిసిన సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం పరంపర కొనసాగిస్తున్న రాజయ్యపై ఓర్వలేకే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలిపారని చెప్పారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కనకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పరీన్రెడ్డి, సర్పంచ్ తాటికాయల అశోక్, మేడిపల్లి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు నజీర్, టీఆర్ఎస్వీ మండల నాయకులు తాటికాయ వరుణ్, చేతన్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజకుమార్, ఉపసర్పంచ్ నరేష్, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ సోమశేఖర్, వార్డ్ సభ్యుడు రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.