Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే, దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్జేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత మంద కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్య క్రమం నిర్వహించాఉ. ఈ సందర్భంగా మంద కుమార్ పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేస్తే తాము సహకరిస్తామని అన్నారు. దళి తున్ని సీఎం చేస్తానని కేసీఆర్ సీఎం గా కొనసా గుతున్నారని ఎద్దేవా చేశారు. హుజరాబాద్ నియోజక వర్గంలో 20 వేల మందికి కాకుండా 45వేల మంది దళిత కుటుంబాలకు దళితబంధు అమల్జేయలన్నారు. రాష్ట్రంలో 54 లక్షలమంది ఎస్సీ జనాభా ఉన్నదని, ఇందులో పురుషులు 26.593 లక్షలు, మహిళలు 27.6 16 లక్షలు ఉన్నారని, వీరందరికీ దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 10 నుండి 15 వరకు మండల కార్యాలయాల ఎదుట ఆందోళన కార్య క్రమాలు నిర్వహించాలని, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 4 వరకు పాదయాత్రలు చేయాలని, సెప్టెంబర్ 5న దళితులందరితో హుజురాబాద్లో దళిత గర్జన మహా సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.