Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో మౌళిక సదు పాయాల అభివద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సంబంధితశాఖల అధికారులతో ఆయన సమేశమై మాట్లాడారు. ప్రభుత్వం సంకల్పించిన సీసీరోడ్లు, సీసీ డ్రెయిన్లు,విద్యుత్ సదుపాయాలు, మిషన్ భగీరథ నీటికి సంబంధించిన అంశాలు సర్వే చేసి రిపోర్ట్ తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పీఆర్ ఏఈ విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ ఏఈలు ఈ పనులకు అంచనాలు రూపొందించి పూర్తి చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మధుసూదన్, ఎలక్ట్రిసిటీ ఏడీ చంద్రమౌళి, ఏఈ రవి, పీఆర్ ఏఈ కవిత, మిషన్ భగిరథ వర్క్ ఇన్స్పెక్టర్ నిఖిల్, ఏపీిఓ సుశీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.