Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై దుష్ప్రచారం అర్ధరహితమని జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి ఆకుల కుమార్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రవి మాట్లాడారు. ఎమ్మెల్యే రాజయ్య వైఎస్ షర్మిలను కలిసి పార్టీ మారబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులకు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ది పొందాలనే అక్కసుతో చేస్తున్న దుర్మార్గులకు ప్రజలే గుణపాఠం చెబుతారని తెలిపారు. వైద్య వత్తిలో సమాజాహితానికి అనేక మందికి బాసటగా నిలిచారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ సాయంతో ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో స్వరాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తప్పుడు పోస్టులతో ఇబ్బంది పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. విజ్ఞత లేని కొందరూ పిచ్చిరాతలు మానుకోవాలని ఓ పత్రికను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు తాటికొండ సురేష్కుమార్, తోట సత్యం, ఎంపీటీసీలు సింగపురం దయాకర్, గన్ను నర్సింహులు, గుర్రం రాజు, మండల కన్వీనర్ మాచర్ల గణేష్, నియోజకవర్గ కోఆర్డినేటర్ రంగు రమేష్, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, చిల్పూర్ దేవస్థాన సభ్యురాలు పొన్నం రజిత రంజిత్, బొంకూరి మహేష్, ఆకారపు అశోక్, గాదె రాజు, బొల్లు లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.