Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్
నవతెలంగాణ-ములుగు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ సంఘం ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలో సురేందర్ ఆధ్వర్యంలో సోమవారం జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య హాజరై మాట్లాడారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో జరిగిన పోరాటాన్ని గుర్తు చేశారు. ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, తదితరులు ఉద్యమించారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు, మైదాన ప్రాంత గిరిజనేతర వలసలకు వ్యతిరేకంగా అనేక మంది ఆదివాసీ ప్రజలు పోరాడి ప్రాణాలు అర్పించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని పొందుపర్చిన 5వ, 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవించే హక్కు లభించిందన్నారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సంఘం రాష్ట్ర మహిళ కార్యదర్శి బద్ధుల లక్ష్మీ, సమ్మక్క-సారక్క ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గంటమోరి భాగ్యలక్ష్మీ, కుల పెద్దలు కొత్త సదయ్య, ఆకుల మొగిలి, అరిగెల సమ్మయ్య, ఆకుల రాజు, కొత్త రాజేష్, కొత్త రాజ్‌కుమార్, పొలం శ్రావణ్, కొత్త నిర్మల, అరిగెల స్వప్న, మండపు సుమలత, చిర్ర మహేందర్, చిర్ర మహేష్, గొల్ల చిన్నికుమార్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో..
వైఎస్సార్టీపీ మండల కన్వీనర్ చాంద్ పాషా ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబా బాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కోకన్వీనర్ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బజారు శ్యాంప్రసాద్ హాజరై మాట్లాడారు. నాటి నైజాంతో జరిగిన పోరాటానికి కొమురం భీం నాయకత్వం వహించారని, ప్రస్తుత నయా నిజాం కేసీఆర్ ఆదివాసీలను అణచి వేస్తున్నాడని తెలిపారు. 2006లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదివాసీలకు అటవీ భూములపై హక్కు పత్రాలివ్వగా ప్రస్తుత సీఎం కేసీఆర్ హరితహారం పేరుతో లాక్కుంటున్నారని విమర్శించారు. ఆదివాసీల తిరుగుబాటుకు వైఎస్సార్టీపీ అధినేత షర్మిలమ్మ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు అన్న తిరుపతి, దుగ్యాల ప్రవీణ్, కొండబోయిన దిలీప్, గాదె ఇన్నారెడ్డి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో
బయ్యారం : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని ఇర్సులాపురం గ్రామంలో ఆదివాసీ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకుడు జగన్న, డివిజన్ నాయకులు బిల్లకంటి సూర్యం, ఉమ్మగాని సత్యం, జక్కుల యాకయ్య, ముత్యాల భద్రయ్య, చిన్నం రమేష్, జక్కుల అశోక్, లీలన్, శెట్టి వెంకన్న, ఆనందాచారి తదితరులు పాల్గొన్నారు.
తుడుందెబ్బ ఆధ్వర్యంలో.. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లోని కొమురం భీమ్ విగ్రహానికి తుడుందెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వీసం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాటి స్వామి, రామనాథం, నాగేశ్వరరావు, సర్పంచ్‌లు కోటమ్మ, పోలేబోయిన వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌రావు, సుభద్ర, కృష్ణవేణి, రమేష్, వెంకన్న, నాయకులు వెంకటేశ్వర్లు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహానికి సర్పంచ్ల ఫోరమ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఇస్లావత్ తండా సర్పంచ్ బోడ లక్ష్మణ్ నాయక్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షుడు దర్శనం రామకృష్ణ, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రామ్, జిల్లా నాయకులు బానోత్ రామకోటి, మూడు రవినాయక్, లాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం : గిరిజన సంఘాల ఆద్వర్యంలో మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. తొలుత కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాయం రమణ, ఎంపీపీ చెరుకూరి సతీష్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిడెం యామిలీ, బర్లగూడెం, ఆలుబాక సర్పంచ్‌లు కొర్సా నర్సింహమూర్తి, పూజారి ఆదిలక్ష్మీ, ఉయికా శంకర్, పర్శిక సతీష్, రాంచందర్, నాగరాజు, క్రిష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.
కురవి : మండల కేంద్రంలో టీజీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవం నిర్వహించగా రాష్ట్ర కమిటీ సభ్యులు మాలోత్ కిషన్ నాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాజా, సీపీఎం(ఐ) నాయకులు కట్ల కష్ణయ్య గిరిజన సంఘం నాయకులు బానోత్ రాజునాయక్, బానోత్ రమేష్, బానోత్ అనిల్ గుగులోత్ హుసేన్, విజయ, స్వామి తదితరులు పాల్గొన్నారు.
గార్ల : నెహ్రూ సెంటర్లో ఆదివాసీ జెండాను ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు తాటి సమ్మయ్య ఆవిష్కరించారు. అనంతరం జిల్లా నాయకులు మాడే రామకృష్ణ, కబ్బాకుల వెంకన్న మాట్లాడారు. కార్యక్రమంలో సీతంపేట ఎంపీటీసీ గుండె బోయిన నాగమణి, జిల్లా, మండల నాయకులు వీరభద్రం, మోకాళ్ల రామచంద్రు, వట్టం లింగరాజు, రాము, వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : మండల కేంద్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో కొమురం భీమ కాలనీ నుంచి ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో పొడుగు కష్ణమూర్తి, చాపల నాగయ్య పటేల్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం నిర్వహించిన సభకు బత్తుల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు ఈసం సుధాకర్, ఆదివాసి రచయితల సంఘం అధ్యక్షుడు పెనుక ప్రభాకర్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాడిగే నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, మాజీ ఏంఈఓ కాంతారావు, దారం శ్రీనివాస్, వీరయ్య, సమ్మయ్య, ఈసం రమేష్, కాక నర్సయ్య, రమేష్, వెంకన్న, లక్ష్మయ్య, భద్రయ్య, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.