Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డోర్నకల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ కేశబోయిన కోటిలింగం
నవతెలంగాణ-డోర్నకల్
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున బరిలో నిలుస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలుపు గుర్రంలా డోర్నకల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ కేశనబోయిన కోటిలింగం అభివర్ణించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కోటిలింగం కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోటిలింగం ప్రసంగించారు. ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీ కోసం క్రీయాశీలకంగా శ్రీనివాస్ యాదవ్ ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో 120 కేసుల శ్రీనివాస్‌గా పిలవబడ్డాడని తెలిపారు. బీసీ యాదవ కులానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ యాదవులకు ఇస్తున్న ప్రాధాన్యత మరువలేనిదని కొనియాడారు. 200 ఎకరాలు అక్రమంగా సంపాదించిన ఈటల రాజేందర్ కావాలా? కేవలం 2 గుంటల భూమి కలిగి, తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులు ఎదుర్కొన్నా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావాలో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. డోర్నకల్ పార్టీ పక్షాన, మున్సిపల్ పాలకవర్గం పక్షాన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పచ్చిపాల గోపీ, సకినాల వెంకన్న, కొంగల వీరభద్రం, జాల నరేష్, పచ్చిపాల రాంబాబు, ఎల్లబోయిన యాకేష్, బొబ్బల ఉపేందర్, పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేశబోయిన వెంకటేష్, పరాల యాకేష్, కొత్త ప్రవీణ్, జక్కుల.లింగస్వామి, కొత్త శివ, కొత్త నరేందర్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు దేశబోయిన శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.