Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
లేబర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులను జాప్యం లేకుండా చెల్లించాలని బిల్డింగ్ అండ్ ఆధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గన్నరపు రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ములుగు జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జంగాలపల్లి లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన, బిఓసిడబ్ల్యుయు, యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గన్నారపు రమేష్ హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కు సంబంధించిన లేబర్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన క్లెయిమ్స్ సకాలంలో అందడం లేదన్నారు. సంవత్సరాలకు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటం ఎంతవరకు సమంజసం అన్నారు లేబర్ కార్యాలయం అధికారులు క్లెయిమ్స్ పంపించడంలో అలసత్వం వహిస్తున్నారు అన్నారు. భవన నిర్మాణాల ద్వారా సెస్సు రూపంలో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం నుండి భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ సెటిల్ చేయవలసింది కానీ అట్టి నిధుల నుండి ఇ వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కరుణ సందర్భంలో లో తీసుకోవడం వలన ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు కనుక ప్రభుత్వం వెంటనే అట్టి నిధులను విడుదల చేసి క్లైయింస్, షెడ్యూల్ చేయాలని అన్నారు అలాగే ప్రస్తుతం కార్మిక శాఖ లో సభ్యత్వం కలిగిన వారికి క్లెయిమ్స్ రూపంలో లో ఇస్తున్న రూపాయలు లక్షల ముప్పై వేలు లు బదులు 10 లక్షలు అందించాల అన్నారు. అందులో భాగంగా ఈనెల 18వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా మహాసభలు భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, భూపాలపల్లి జిల్లా సహాయ కార్యదర్శి కుడుదుల వెంకటేష్, నిర్మల, ముత్యాల రాజు, శర బంధం, తంగళ్ళపల్లి సురేందర్, వెంకన్న, తిరుపతి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.