Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వర్రావు కోరారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ రంగానికి సంబంధించి 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను, 9 శిక్షణా కేంద్రాలను, 52 పరిశోధనా సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ద్వారా దేశ రక్షణ, ప్రజా భద్రత బాధ్యత నుంచి వైదొలగుతోందని విమర్శించారు. రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడమంటే ఆ పరిశ్రమలను స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలు నిర్వహించేలా చట్టాలు చేయడం అంటే దేశ సార్వభౌమత్వాన్ని స్వతంత్రత దేశానికి ఉందనడం పచ్చి అబద్దమని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వ రంగంలో ఉన్న విమానయాన సంస్థలను ముఖ్యంగా నాలుగు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించం అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా దుర్మార్గం అని ఆయన అన్నారు. ప్రభుత్వ విమానయాన సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న పేరుతో ఈ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 90వ దశకంలో వచ్చిన ఓపెన్ స్కై పాలసీలో భాగంగానే ఈ చర్యలు మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది నిజానికి ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రభుత్వ విధానాల వలన నష్టాలు కూరుకుపోయాయి ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిరిండియా సంస్థలను పార్లమెంటరీ కమిటీ సూచనలను కాదని ఆ రెండు సంవత్సరాలను విలీనం చేయడం లాభాల్లో ఉన్న రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఇంజన్లు ఇతర విభాగాలు లేవన కారణంగా డిపోలకే 2452 విమానాలను పరిమితం చేసిందని వాస్తవానికి వీటన్నింటినీ వినియోగంలోకి తేవడానికి 2500 కోట్లు అవసరమని వాటిని మంజూరు చేయాలని ఎయిర్‌లైన్స్ సంస్థ అర్జీ పెట్టుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకపోవడం తదితర కారణాలే ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ సంస్థల నష్టాలకు కారణమని సాధినేని పేర్కొన్నారు. అనన్య త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుపరిశ్రమ నూరు శాతం ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజావ్యతిరేక కార్మిక వ్యతిరేక నిర్ణయమని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలహక్కు, దేశ ప్రజల హక్కు అని ఆయన అన్నారు. సుమారు లక్ష కోట్లకు పైగా విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను దాని ఆస్తులను కేవలం 1100 కోట్లకే కార్పొరేట్ వర్గాలకు అప్పగించాలని నిర్ణయించడం ప్రజల సొమ్మును కారుచౌకగా బడా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడమేనని సాధినేని వివరించారు. ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపి ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాలు, వారి వ్యాపార, వాణిజ్య అవసరాలకు దష్టిలో పెట్టుకొని విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రాబోతుందని ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. ఈ చట్టం వస్తే రాష్ట్రాలకు ఉన్న హక్కులు పోతాయని ఇప్పటివరకు ప్రజలు, రైతులు పొందుతున్న సబ్సిడీలు కూడా రద్దు అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థల వారి పెట్టుబడులకు పరిశ్రమలకు తగిన రక్షణ కల్పించే చర్యల్లో భాగంగా వారికి ప్రతికూలంగాదేశంలో ఉన్న పర్యావరణ చట్టాలు అన్నింటిని రద్దు చేయడమే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పర్యావరణ బిల్లులోని ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. గత ఎనిమిది మాసాలుగా ఢిల్లీ కేంద్రంగా గా లక్షలాది మంది రైతులు కాంట్రాక్టు వ్యవసాయం కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా ఉన్న మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని సాధినేని డిమాండ్ చేశారు. శతాబ్దాల తరబడి దేశ కార్మికవర్గం పోరాడి అనేక బలిదానాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధానంగా 44 రకాల కీలకమైన చట్టాలను ఇస్తూ 4 లేబర్ కోడ్ లు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వ రంగ పరిశ్రమలలో కార్మికవర్గం తమ మౌలిక హక్కు అయిన సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకుని హక్కు, యాజమాన్యాలతో ప్రభుత్వంతో బేరసారాల హక్కును నిరాకరించడం కోసమే కనుక కార్మిక వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ చర్యలవల్ల దేశ కార్మిక వర్గంలో తీవ్ర అసంతప్తి పెరుగుతోందని ఈ విధానాలను ప్రతిఘటించే వైపుగా కార్మిక వర్గం వివిధ రూపాల్లో ఆందోళన సాగిస్తుందని తెలిపారు. ఆందోళనలు జరగకుండా కార్మిక వర్గంలో పెరుగుతున్న అసంతప్తి వ్యతిరేకతను అణిచివేయడానికి ప్రధానంగా రక్షణ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటిస్తూ రక్షణ ఉద్యోగులపై అత్యవసర సేవల చట్టం 2021 ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని ఇది వలస పాలనలో దానికంటే ప్రమాదకరమైందని అన్నారు.కార్మికుల, రైతాంగం యొక్క మౌలిక హక్కులను నిరాకరించే లక్ష్యంతో తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఆరెల్లి కష్ణ, కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సీతారామయ్య, విశ్వనాథ్, కార్యదర్శులు అనురాధ, శివ బాబు, కోశాధికారి రాసుద్దీన్, జిల్లా అధ్యక్షుడు మదార్, రాష్ట్ర నాయకులు వీరభద్రం, శ్రీధర్, రాంసింగ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.