Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మహబూబాబాద్
నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రావుల రాజు విమర్శించారు. తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రావుల రాజు, రజాక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయికుమార్ మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో యువతను, విద్యార్థులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఏటా కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఆ విషయాన్ని విస్మరించిందని మండిపడ్డారు. విదేశీ యూనివర్సిటీలను తీసుకొచ్చి స్వదేశీ యూనివర్సిటీలను నీరుగార్చే కుట్ర చేస్తున్నారని ద్వజమెత్తారు. రాష్ట్రంలోని రెండు లక్షల ఉద్యోగ ఖాళీలన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. నిరుద్యోగ సమస్యపై ఈనెల 20న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు గొడుగు కుమార్, సూర్యకుమార్, బానోత్ ప్రకాష్, తాండూరు శోభన్, సుంకర వెంకటేష్, పాషా, తదితరులు పాల్గొన్నారు.
జనగామ : ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దడిగే సందీప్ అధ్యక్షతన డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల జిల్లా కార్యదర్శులు బోడ నరేందర్, దూసరి నాగరాజు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగట్టారు. సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బానోతు ధర్మభిక్షం, పొదల దేవేందర్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి అజారుద్దీన్, టీజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర సురేష్, తేజావత్ గణేష్, నాయకులు లవకుమార్, మామిడాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ మాట్లా డారు. పాలకులు అవలంభిస్తున్న విధానాలను యువతకు, విద్యార్థులకు వివరించి పోరాటాలు నిర్మించి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కలువల రవీందర్, టౌన్ కన్వీ నర్ శివరాత్రి నాగరాజు, నాయకులు భరత్, చంటి తదితరులు పాల్గొన్నారు.