Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి
నవతెలంగాణ-ములుగు
ఇంద్రవెల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మహాసభ విజయవంతాన్ని ఓర్వలేకే కొందరు టీఆర్ఎస్ నాయకులు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల సమ యాల్లో అనేక హామీలివ్వడం, తదనంతరం విస్మరించడం పరిపాటి గా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్ హయాంలోనే సుపరిపాలన అందిందని స్పష్టం చేశారు. దళితులకు భూపంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తదితర అనేక హామీలను విస్మరించిన టీఆర్ఎస్ హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళిత రాగం ఎత్తుకుందని ధ్వజమెత్తారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ అధిష్టానానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పేద దళిత కుటుంబాలన్నిటికీ దళితబంధు వర్తింపజేయాలని హితవు పలికారు. పోడు భూములకు పట్టాలిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు మానుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఆకుతోట చంద్రమౌళి, నరేందర్, చర్ప రవి, రఘు, ఫారూఖ్, ముస్తఫా, చక్రపు రాజు, మాజీ ఎంపీటీసీ తిమ్మంపేట శ్రీను, తిమ్మంపేట డాక్టర్ రాంబాబు, మాజీ ఎంపీటీసి పత్తిపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల కేంద్రంలో నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ను, ఎమ్మెల్యే సీతక్కను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మోసపూరిత విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, మండల అధ్యక్షుడు భూక్య రాజు, పాడియా రాజు, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాటోత్ చంద్రకాంత్, వార్డ్ సభ్యుడు నూనావత్ శ్రావణ్, మండల కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు పడిగ పార్వతి తదితరులు పాల్గొన్నారు.