Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సర్టిఫికెట్లను అందజేశారు. వరంగల్ అర్బన్ రెడ్‌క్రాస్ సొసైటీలో జిల్లాలోని స్కూల్స్, కళాశాలలు, యూత్ రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం నమోదు చేసుకున్నందుకు తెలంగాణ రెడ్‌క్రాస్ సొసైటీ నుండి తెలంగాణ రాష్ట గవర్నర్, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు బుధవారం కలెక్టర్ కాన్ఫెరెన్స్ హాల్లో ్ల కలెక్టర్ చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ సొసైటీలో చేరిన విద్యార్థులకు ప్రథమ చికిత్స ట్రైనింగ్ ఇస్తారని అన్నారు. విద్యార్థి స్థాయినుంచే సేవ గుణాన్ని అలవర్చాలన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్‌రెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, బొమ్మినేని పాపిరెడ్డి, డాక్టర్ టి. విజయలక్ష్మి, పెద్ది వెంకటనారాయణగౌడ్, చెన్నమనేని జయశ్రీ, నిట్ డీన్ ప్రొఫెసర్ జేవీ రమణమూర్తి, కళాశాల, స్కూల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.