Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని, అర్హులైన విద్యార్థులకు కరోనా నివారణ వ్యాక్సిన్ అందించి దశలవారీగా పాఠశాలలు తెరవా లని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, విద్యారంగంలో నెలకొన్న ఇతర సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బుధ వారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, పాధి కల్పనలో విఫలమైందని విమర్శించారు. ఈనెల 20 వరకు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. పాలకులు ప్రభుత్వ విద్యా రంగాన్ని నీరుగార్చుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంకాని వీర్రాజు, మారా వంశీ, శ్రీరామ్, భూపతి రాజు, వంశీ, యుగేందర్ స్వామి, నరేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.