Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైన అనంతరం బీజీపీ, టీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తు న్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశలో ఆయన మాట్లాడారు. తెలంగాణ భాష, యాసను అడ్డంపెట్టుకొని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇంద్రవెళ్లి బహి రంగ సభలో టీఆర్ఎస్ మోసాలను ఎండగడుతం, నాయ కులను బొంద పెడుతామని రేవంత్‌రెడ్డి అన్న ఒక్క మాటకు టీఆర్ఎస్ నాయకులు అనుచితంగా మాట్లాడడం సరికా దన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే పదవులు దక్కాయన్నారు. బాల్క సుమన్ యూనివర్సిటీకి వెళ్తే తోలు తీస్తారన్నారు. దళితుల సమ స్యలపై ఏనాడు మాట్లాడని సుమన్ ఓ దొంగ ఉద్యమ కారుడన్నారు. కాజిపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి 6 నెలల కిందట ఉద్యమం ప్రారంభించారన్నారు. కోవర్ట్ లను పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చిన చరిత్ర చీఫ్‌విప్ వినరు భాస్కరదేనని అన్నారు. కాజిపేట అభివద్ధిని పట్టించుకోని వినరు భాస్కర్‌కు కాంగ్రెస్ పట్ల మాట్లాడే హక్కు లేదన్నారు. ఎక్కడ ఖాళి స్థలం కనపడినా ఆక్రమించుకునే టీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సీడీఎఫ్ ఫండ్ అభివద్ధికి ఖర్చు చేయకపోవడంతో వెనక్కి మళ్లాయన్నారు. రూ.2 కోట్లు నియోజకవర్గానికి ఖర్చు చేయలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ దౌర్జన్యాలు, కబ్జాలపై లూటీలపై లెక్కలు తీసి వడ్డీతో సహా కక్కిస్తా మన్నారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. 60 ఏండ్లలో రూ.60 దాటని పెట్రోల్ ఏడున్నరేండ్లలో రూ.100 దాటిందన్నారు. ఉప ఎన్నికల లభ్ది కోసమే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారన్నారు. దళితుల ఓట్లను దండుకునేందుకు దళితబంధు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న దళితులకు, గిరిజనుల బిడ్డలకు, అందరికి దళిత బందు ఇవ్వాలన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ దొమ్మాటి సాంబయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పో రేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, ఎస్సీ డిపార్టుమెంటు జిల్లా చైర్మన్ రామకష్ణ, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, మహిళా కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బంక సరళ తదితరులు పాల్గొన్నారు.