Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-మంగపేట
గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలోని రాజుపేటలో ఏర్పాటు చేసిన గిరిజన్ ఫిల్లింగ్ స్టేషన్లో క్వాలిటీ, క్వాంటిటీతో సేవలు అందించనున్నట్లు జీసీసీ ఏటూరు నాగారం డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి తెలి పారు. సదరు ఫిల్లింగ్ స్టేషన్ ట్రయల్ రన్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌తో స్థానిక గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అలాగే వాహన దార్లకు నాణ్యమైన పెట్రోల్ అందుతుందని తెలి పారు. ఈనెల 19 నుంచి ప్రజలు బంక్ సేవ లను పొందవచ్చని వివరించారు. బంక్ సేవ లను మండలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ సేల్స్ ఆఫీ సర్ శ్యాంసుందర్‌రెడ్డి, జీసీసీ ఏటూరునాగారం సొసైటీ మేనేజర్ దేవు, సిబ్బంది పాల్గొన్నారు.