Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ కీర్తినగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు బి సుమన్, అర్చన అధ్వ ర్యంలో బుధవారం నూతన వ్యాక్సిన్ టీకాను డీఐఓ గీత లక్ష్మి ప్రారంభిం చారు. న్యూమోనియా వ్యాధి రాకుండా పిల్లలకు తప్పని సరిగా న్యూమో కొకల్ కాంజుగేట్ టీకా వేయించాల న్నారు. శ్రీనివాస్ వైకుంఠం కల్యాణి, అవినాష్ విక్రమ్, చిరంజీవి, లావణ్య, మౌనిక పాల్గొన్నారు
సంగెం : స్థానిక పీహెచ్సీలో వైద్యాధికారి పి అశోక్ ఆధ్వర్యంలో న్యూమో కోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(టీకా) కార్యక్రమాన్ని బుధవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రకాష్, డిప్యూటీ డీిఎంహెచ్ఓ ఎన్ గోపాల్రావు ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకా న్యూమో కొకల్ నిమోనియా వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందని తెలిపారు. నవజాత శిశువుల్లో మొదటి డోసు ఆరు వారాలకు, రెండవ డోసు 14వారాలకు, బూస్టర్ డోసు 9నెలలు నిండిన తర్వాత టీకా తీసుకోవాలన్నారు. వ్యాధి నిరోధక టీకా కార్యక్రం వందశాతం పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్ర ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు. హెచ్ఈఓ ఎన్సి సత్య రాజ్, పీహెచ్ ఎం శాంతమ్మ, హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాస్, రంజిత్, ఏఎన్ఎం సునిత, ఆశావర్కర్లు పాల్గొన్నారు.