Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రంలోని తాడిచెర్లలో భూఅక్రమాలకు పాల్పడుతూ, నిరుపేదలను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన బొబ్బిలి రాజయ్య (అలియాసిస్ లాల్సి రాజయ్య)పై ప్రభుత్వం, రెవెన్యూ, పోలీసుశాఖ అధి కారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు పి కిరణ్, అక్కల బాపుయాదవ్, మిణుగు నగేష్, బండి నర్సింగం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో బాధితులు కోట లక్ష్మయ్య, మద్దుల బుచ్చమ్మను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారుమాట్లాడారు. అధికారపార్టీ అండతో రెవెన్యూ అధికారులకు లంచాలిచ్చి నిరుపేదల భూముల కబ్జాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. 200మంది గీత కార్మికుల కుటుంబాల బతుకుదెరువు కోసం ప్రభుత్వ భూముల్లో పెంచిన వంద లాది తాటిచెట్లను ధ్వంసం చేశారని అన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసీ తన ఇంటి చుట్టు పక్కల ఉన్న నిరుపేదలకు చెందిన ఇంటి స్థలాలను ఆయన కుటుంబ సభ్యులపై అక్ర మంగా ఆన్లైన్ పట్టాలు పొందినటట్టు ఆరో పణలొస్తున్నాయన్నారు. కొన్నేండ్లుగా గ్రామంలో ఆయన అరాచకాలు మితిమీరి పోతున్నాయని అన్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవట్లేదని వాపోయారు. కొన్నేండ్ల కిందట అమ్మిన భూ ములకు ఎదురు తిరగడం, భయబ్రాంతులకు గురిచేయడం, పంచాయితీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి లాల్సి రాజయ్యపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుం బాలైన కోట లక్ష్మయ్య, భూమి సర్వే నెంబర్ 873, రక్బ 11 గుంటలు, మద్దుల బుచ్చమ్మ సర్వే నెంబర్ 876 రక్బ 2గుంటల ఇంటి స్థలాలను వారికి పట్టాలు చేయాలని కోరారు. అక్రమంగా తాటిచెట్లను ధ్వంసం చేసిన సర్వే 494లో 4ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోని నిందితునిపై కేసు నమోదు చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చెపడతామని హెచ్చరించారు