Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేయూ క్యాంపస్
కేంద్ర, రాష్ట్ర పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను విద్యార్థులు ప్రశ్నించాలని, వాటికి వ్యతిరేకంగా పోరాడాలని టీపీటీఎఫ్ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర్ పిలుపునిచ్చారు. కేయూ ప్రొఫెసర్ జాఫర్నిజాం సెమినార్హాల్లో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పీడీఎస్యూ జిల్లా జనరల్కౌన్సిల్లో సోమేశ్వర్ మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం విద్యార్థులు లేరనే సాకుతో, ఉపాధ్యాయులు సరిగ్గా పనిచేయడం లేదఅనే పేరుతో 8వేల పాఠశాలను రేషనలైజేషన్ చేసి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దురదష్టకరమైన చర్యఅని, పాఠశాలల అభివద్ధికి నిధులు కేటాయించకుండా విచ్చలవిడిగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులనిస్తే ప్రభుత్వవిద్యా సంస్థలు ఎలా మనుగడ సాధిస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వ పనితీరుతో పేద దళిత, గిరిజన విద్యార్థులను చదువులకు దూరం కానున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎస్యూ రాష్ట్రకార్యదర్శి విజరుఖన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకో విద్యార్థి, నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే వారి గోడు పట్టని కేసీఆర్ మాయల మరాఠీగా మారాడని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలోని పోస్టులను సైతం భర్తీ చేయాలని అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర మాజీ కార్యదర్శి బండి కోటేశ్వరరావు, టీపీఎఫ్ జిల్లా నాయకుడు అజరుబాబు ప్రసంగించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని 13 మందితో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ రంజిత్, శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సూత్రం అనిల్, అర్జున్, మహేష్ శివ, సాగర్, అశోక్, ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు.