Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
సీఎం కేసీఆర్ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న తలపెట్టిన చలో హుజురాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బుధవారం శంఖారావం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రాజేందర్‌తోపాటు పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుడిమె సదయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ వర్తింపజేస్తూ వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో అన్ని రంగాల కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జీఓలు విడుదల చేశారని తెలిపారు. కాగా కరోన కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన పంచాయతీ కార్మికుల జీతాలు పెంచక పోవడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ పోరాట ఫలితంగానే 40 రోజుల క్రితం గ్రామపంచాయతీ కార్మికులు అనేక హామీలు గుప్పించినా, తదనంతరం సీఎం కేసీఆర్ విస్మరించాడని ధ్వజమెత్తారు. ఈనెల 20న నిర్వహించనున్న చలో హుజురాబాద్ శంఖారావం కార్యక్రమానికి కార్మికులు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, రంజిత్, కిరణ్, లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్, లక్ష్మణ్‌రెడ్డి, సంతోష్, ప్రవీణ్, నాగేశ్వర్రావు, మధు బాబు, సమ్మయ్య, అనూష, శాంతకుమారి, కుమారి, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.