Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మహిళా సంఘాలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, తహసీల్దార్ సయ్యద్ రషీద్, ఏపీఎం రంగా ఉపేందర్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని మయూరి మండల సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షురాలు మాధవి అధ్యక్షతన బుధవారం 12వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాధవి, తహసీల్దార్ రషీద్, ఏపీఎం ఉపేందర్ మాట్లాడారు. నెలవారీగా సక్రమంగా పొదుపు చేసుకోవాలని, అప్పులు సకాలంలో తిరిగి చెల్లించాలని, శ్రీనిధి ద్వారా బీమా పొందాలని, మండల సమాఖ్య అభివద్ధికి తోడ్పడుతూ మహిళా సాధికారతను సాధించాలని సూచించారు. అనంతరం వీఓ సంఘాల అధ్యక్షులు సమావేశం నిర్వహించి నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా నాయిని కోమలత, కార్యదర్శిగా సంధ్య, కోశాధికారిగా మంజుల, ఉపాధ్యక్షురాలుగా శ్రీలత, సహాయ కార్యదర్శిగా విజయ, కష్ణవేణి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్, ఏపీఎం సంగా ఉపేందర్, సీసీలు మహేందర్, రామానుజన్, పుల్లయ్య, వెంకటయ్య, సురేష్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.