Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్న
నవతెలంగాణ-కలెక్టరేట్
పాఠశాలలో టీచర్ పోస్టుల రేషనలైజేషన్‌కు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 25తో ప్రభుత్వ విద్యా రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని, బడులను మూసివేస్తారా... బాగు చేస్తారో ప్రభుత్వం తెలియ జేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. హన్మకొండ వడ్డేపల్లిలోని రవీందర్‌రెడ్డి భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషనలైజేషన్ ఉత్తర్వుల విడుదలకు ముందు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో గాని ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలతో చర్చించలేదని అన్నారు. ఇంతవరకు ఆయా సంఘాలు చేసిన సూచనలు ఏవి పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విడుదల చేయడం సరికాదని అన్నారు. బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించారని వీటితో ఐదు వేల ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయొచ్చన్నారు. పిల్లల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేయాలని అన్నారు. ప్రతి దేశంలో 90శాతం విద్యార్థులు ప్రభుత్వ రంగంలో చదువుతున్నారని, భారతదేశంలో మాత్రమే 47 శాతం మాత్రమే చదువుతున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి అందరికీ ఉచిత విద్య అందేలా చూడాలని అన్నారు. రెండేండ్లుగా పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం వల్ల ప్రస్తుతం పాఠశాలలో కచ్చితమైన నమోదు నిర్ధారించడం సాధ్యంకాదని, పాఠశాలలు భౌతికంగా ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థుల వరకు ఐదు తరగతులు ఇద్దరు టీచర్లతో ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, రాష్ట్ర కార్యదర్శి కే సోమశేఖర్ హనుమకొండ, వరంగల్ జిల్లా బాధ్యులు సిహెచ్ రవీందర్ రాజు, వెంకటరెడ్డి, పెండెం రాజు, సదాశివరెడ్డి, కుమారస్వామి, ప్రసాదరావు, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.