Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-హన్మకొండ
గౌడ పోరాటయోధుడు, బీసీల ఐక్యత కోసం చివరి వరకు పోరాడిన సర్దార్ పాపన్న గౌడ్ తమలాంటి ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తి అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ అన్నారు. బుధవారం హన్మకొండ హంటర్ రోడ్ లోని గౌడ్ హాస్టల్ సమావేశ మందిరంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. 350 ఏండ్ల కిందటే జనగామ జిల్లా ఖిలా షాపూర్ గ్రామంలో సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్నగౌడ్ నాటి నవాబుల అరాచకాలను ఎదుర్కొనేందుకు 12 వేల మంది సైన్యాన్ని తయారుచేసి మొగలాయి రాజుల పై దండయాత్ర చేశాడన్నారు. దాదాపు 20 కోటలు వశపరచుకొని చివరిగా భువనగిరి గోల్కొండ కోటలను కైవసం చేసుకుని బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా పాపన్న స్ఫూర్తితో నడిపించా మని అన్నారు. జనాభాలో 90 శాతమున్న బహుజ నులు సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యమ కారుల గురించి అప్పటి పాలకులు పట్టించుకోలేదని స్వరాష్ట్రంలో గౌడ సంఘం ప్రతినిధులు సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇంత పెద్ద సమావేశం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పాపన్న గురించి ఇంకా సెమినార్లు లైబ్రరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పాపన్నగౌడ్ పేరును హంటర్ రోడ్ జంక్షన్‌కు నామకరణం చేయిస్తానని, భద్రకాళి ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కాంస్య విగ్రహా ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. గౌడ హాస్టల్ అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తానని హామీనిచ్చారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గౌడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లా డుతూ... సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అన్నారు. జనాభాలో 25 శాతం ఉన్న గౌడ కుల స్తులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఇప్పటికైనా గౌడ కులస్తులకు కార్పొరే పదవు ల్లో నైనా ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి, వికలాంగుల చైర్మెన్ వాసుదేవ్‌రెడ్డి, కూడా డైరెక్టర్ చిర్ర రాజు, కార్పొరేటర్ పోషల పద్మ, గౌడ సంక్షేమ సంఘం నాయకులు తాళ్ళపెళ్లి జనార్ధన్్, నాగపూరి రాజమౌళి, బత్తిని రమేష్, పోషల స్వామి, పెరుమండ్ల సత్యనారాయణ, పులి మోహన్, తాళ్ళపెళ్లి రమేష్, సాంబరాజు, పంజల మదు, గుర్రం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.