Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
- ఈనెల 23న మండల కేంద్రాల్లో ఆందోళనలు.
- ఏఐకెఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్
నవతెలంగాణ-సంగెం
ప్రభుత్వ భూములను కాపాడి, నివాస స్థలాలు ఇవ్వాలని పోరాడుతున్న పేదలపై విచక్షణ రహితంగా లాఠీఛార్జి చేయించి గాయాల పాలు కావడానికి కారణమైన నర్సంపేట తాహసిల్దార్ రామ్మూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐకెఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు పోరాటం ఆగదన్నారు. ఈ నెల 23న జిల్లా వ్యాప్త మండల కేంద్ర ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఎంసిపిఐ(యు) సంగెం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ నారగోని ఎల్లగౌడ్ అధ్యక్షతన మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడి అర్హులైన పేదలకు పంచాల్సిన రెవెన్యూ అధికారులు ప్రలోభాలకు లొంగి అనర్హులైన అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిలో లహరి కంపెనీకి చెందిన రెడీ మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. నర్సంపేటలో వివిధ ప్రభుత్వ సర్వే నెంబర్లలో చట్టవిరుద్ధంగా అమ్మకాలు కొనుగోళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తున్న చర్యలు తీసుకోకుండా అర్హుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్దీకరించ కుండా ప్రభుత్వ భూములను కాపాడి ఇండ్లు ఇళ్ల స్థలాలు కావాలని పోరాడుతున్నా పేదలపై తమ ప్రతాపం చూపిస్తూ చట్టాలు ఉన్నోళ్ల చుట్టాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో తమ ప్రాథమిక హక్కు అయినా నివాస స్థలం కోసం పోరాడుతున్న పేదలపై వారికి అండగా నిలిచిన ఎంసిపిఐయు నాయకులపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులను ఉసిగొల్పి అమానుషంగా విచక్షణ రహితంగా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులకు అండగా నిలుస్తూ తప్పుడు కేసులు పెడుతున్న తహసీల్దార్ రామ్మూర్తిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా ఉద్యమం ఉధతం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు, మండల కార్యదర్శి మహమ్మద,్ ఇస్మాయిల్, జిల్లా కమిటీ సభ్యులు మహమ్మద్ రాజా సాహెబ్, కంకణాల మల్లికార్జున్, బత్తిని కుమారస్వామి, స్థానిక నాయకులు గోనే రామచందర్, ఒంటేరు రాజు, రాజేందర్, ప్రవీణ్, బన్నీ, దేవేందర్, జాతర్ల రాజు పాల్గొన్నారు.