Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-తొర్రూరు
అట్టడుగు వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం తుదికంటా పాటుపడిన మాడ్గుల నట్వర్ స్ఫూర్తి ప్రదాత అని పలువురు ప్రముఖులు కొనియాడారు.ఇటీవల అకాలంగా మతి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్ 54వ జయంతి కార్యక్రమం గురువారం డివిజన్ కేంద్రం లోని యతి రాజారావు పార్క్ ఆవరణలో మాడుగుల నట్వర్ కుటుంబ సభ్యులు, అభిమానుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కౌన్సిలర్ మృతికి సంతాపం తెలిపి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నట్వర్ సతీమణి పూలమ్మ, కుమారుడు రోహిత్, కుమార్తె భవాని లను స్థానికులు పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. పట్టణ అభివద్ధి లో నట్వర్ పాత్రఎనలేనిదని, పురపాలిక కు మణి మకుటంగా నిలిచిన యతి రాజారావు పార్కు ను అందంగా తీర్చిదిద్దడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచాడని గుర్తు చేశారు. మాజీ మంత్రి యతి రాజారావు దగ్గర రాజకీయ ఓనమాలు దిద్ది అనతికాలంలోనే ప్రజాభిమానం కలిగిన నేతగా గుర్తింపు పొందారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభంజనం లో తెలుగుదేశంలో, తదనంతరం ప్రత్యేక రాష్ట్ర కాంక్ష తో టీఆర్ఎస్ లో చేరి నమ్మిన పార్టీ అభివద్ధికి నిస్వార్ధంగా పాటు పడ్డాడన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, ప్రస్తుత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ల సూచనలు,మార్గనిర్దేశనంలో పట్టణ అభివద్ధికి అంకితభావంతో పని చేశారని గుర్తు చేశారు. ఎంపీటీసీగా, వార్డు సభ్యునిగా, ప్రస్తుతం కౌన్సిలర్ గా చిత్తశుద్ధితో పనిచేసి, చేపట్టిన పదవికి వన్నె తెచ్చిన ఉత్తమ నాయకుడు నట్వర్ అని కొనియాడారు. ఏఎస్సై హరి శంకర్, కౌన్సిలర్లు ఎన్నమనేని శ్రీనివాసరావు, గుగులోతు శంకర్, ధరావత్ సునీత జై సింగ్,తూనం రోజా, ప్రతినిధులు చకిలేల మణిరాజ్, తెరాస యూత్ నాయకులు ముద్దసాని సురేష్, సాయి ముఖేష్,మాలీక్, పాల్గొన్నారు.