Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల సీనియర్ నాయకులు కామ్రేడ్ చేపూరి రంగన్న(92) గురువారం తుది శ్వాస విడిచారు. గత కొంతకా లంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందు తున్నాడు. ఆరోగ్యం కొంచెం మెరుగు పడుతుందని భావిస్తున్న సమయంలో హఠాన్మరణం చెందారు. మండల పరిధి ఏజెన్సీ కారుకొండ గ్రామానికి చెందిన రంగన్న అడవి ఉద్యమంతో విడదీయలేని అనుబం ధం ఉన్నది. నక్సలైట్ ఉద్యమ ప్రారంభం నుండి ఆ రాజకీయాలతో కొనసాగుతున్న ఆయన మొదటి నుండి ఏజెన్సీ ఉద్యమానికి చేదోడు వాదోడుగా వుంటూవచ్చాడు. 3 దఫాలు కంబాలపల్లి గ్రామపం చాయతీ ఉపసర్పంచ్గా పనిచేశారు. 20 సంవత్సరాలపాటు ఆయన పార్టీ సబ్ డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన మరణం బయ్యారం ఏజన్సీ ఉద్యమంతో తీరని నష్టం. రంగన్న గోదావరి లోయ ప్రతి ఘటన ఉద్యమాన్ని కాపాడ డంలో ముఖ్య పాత్రను పోషించాడు. చండ్ర పుల్లారెడ్డి, దొరన్న, బాటన్న, కోటన్న, ఎల్లన్న, నుండి నేటి లింగన్న వరకు అనేక మంది నాయకులకు ఆశ్రయం కల్పించాడు. చేపూరి ధనుంజయ, రంగన్న కారుకొండ లో నివసించేవారు. వీరిద్దరూ ఏజెన్సీ ఉద్యమాన్ని అంటి పెట్టుకొని ఆదివాసీల సమస్యల పై అనేక పోరాటాలు నిర్వహించారు. ఆ సందర్భంలో ఇతర పార్టీలు ఏజెన్సీకి వెళ్ళడానికి కూడా సహించలేని పరిస్థితి. రంగన్న పై రాజ్యం తప్పుడు కేసులు ప్రయోగించి ఆరు నెలలు వరంగల్ సెంట్రల్ జైల్ లో నిర్బంధించారు. ప్రజా ప్రతిఘటన మాఫియా ముఠా బయ్యారం మండలంలో అనేక రకాల విధ్వంసాన్ని సష్టించిన సందర్భంలో పార్టీ వైపు దృఢంగా నిలబడి పార్టీని కాపాడడంలో రంగన్న దిక్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన మృతి పట్ల సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పూలమాలవేసి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఊకే పద్మ, జిల్లా నాయకులు ఎస్.కె మధార్, దేవేందర్, బాబు, రామగిరి బిక్షం, తుడుం వీరభద్రం, సమ్మయ్య, మోకాళ్ళ మురళీకష్ణలు ఘన నివాళులు అర్పించారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల సబ్ డివిజన్ కమిటీ తరఫున విప్లవ జోహార్లు తెలిపారు. న్యూడెమోక్రసీ బయ్యారం ఎస్డిఎల్సి తరపున నివాళులర్పిస్తున్న ట్టు మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు.