Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
కూలీల వలసలను అదుపు చేయడానికి, ఉన్న ఉరిలోనే కూలీలకు చేతినిండా కూలి పని కల్పించడా నికి గత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతి కూలికి పని కల్పించాలని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని చిన్నతూండ్ల, దుబ్బపేట,తాడిచెర్ల గ్రామాల్లో కొత్తగా 2021-2026 మంజూరైన ఉపాధిహామీ జాబ్ కార్డులను ఎంపిడిఓ నరసింహమూర్తి, స్థానిక సర్పంచ్లు పులిగంటి మమత నర్సయ్య, అజ్మీరా ప్రేమలత రాజునాయక్, సత్యనారాయణతో కలిసి కూలీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ప్రకాష్ రావు, ఎంపిఓ విక్రమ్, పంచాయతీ కార్యదర్శులు సమ్మరాజు,ప్రవీణ్, సత్యనారాయణ, వార్డు సభ్యులు, జిపి సిబ్బంది పాల్గొన్నారు.