Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
ప్రజాస్వామ్యానికి పెనుముప్పు పెగసస్ పుస్తకాన్ని గురువారం హన్మకొండలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, నవతెలంగాణ జనరల్ మేనేజర్ సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలోని మేధావులు, జర్నలిస్టులు, రాజీకీయ నాయకులు, న్యాయవాదులను పెగసెస్ పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వా మ్యానికి పెగసస్ అత్యంత ప్రమాదకరమని, మీ ఫోన్‌తోనే మీపై నిఘా పెట్టడం ప్రమాదకర మన్నారు. ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక వ్యక్తి స్వేచ్చను, పౌర స్వేచ్చను హరిస్తున్నారని ఆరోపిం చారు. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, 370 ఆర్టికల్‌ను రద్దు చేశారని, ప్రజల స్వేచ్చ, సమాచారా నికి నష్టం కలగవద్దని ఉన్నా పెగసెస్ను వినియోగి స్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ మేనేజర్ దేవేందర్‌రావు, పబ్టిషింగ్ మేనేజర్ బండారి బాబు, శ్రీనివాస్, నవతెలంగాణ ప్రతినిధి దయాసాగర్, సామ నర్సయ్య పాల్గొన్నారు.