Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్ పర్సన్‌గా దిడ్డి భాగ్యలక్ష్మి తొలిసారి మహిళకు చాన్స్
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఎట్టకేలకు వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వం నూతన పాలక వర్గాన్ని ప్రకటించింది. 87ఏళ్ల మార్కెట్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను చైర్‌పర్సన్‌గా నియమించారు. టీిఆర్‌ఎస్ పార్టీ సీని యర్ నాయకుడు, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి సతీమణి భాగ్యలక్ష్మికి చైర్ పర్సన్‌గా అవకాశం దక్కింది. వైస్ చైర్మెన్‌గా కాలేరు కరమ్ చంద్, కమిటీ సభ్యులుగా గోలి రాజయ్య, పసునూరి సారంగపాణి, తుమ్మ రవీ ందర్ రెడ్డి, గనిపాక విజరు కుమార్, పట్టాపురం ఏకాంతం గౌడ్, పల్లెపాటి శాంతి రతన్ రావు, కంది రవీందర్ రెడ్డి, పిన్నింటి వెంకట్ రావులను నియ మించారు. వీరితో పాటు ధర్మసాగర్ పీఏసీఎస్ చైర్మన్ డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీ సర్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, బల్దియా మేయర్ సభ్యులుగా ఉంటారు.