Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కార్మికులకు పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను జమ్మికుంటలో ఇస్తున్న మాదిరిగా అన్ని మున్సిపాల్టీల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపాలిటీ కార్మికులు శంఖారావంకు బయలుదేరి వెళ్లినట్లు సీఐటీయూ జిల్లా అద్యక్షుడు కార్యదర్శి కంపేటి రాజయ్య, బొట్ల చక్రపాణి తెలంగాణ మున్సిపాలిటీవర్కర్స్ %డ% ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వెలిశేట్టి రాజయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక పాత గ్రామపంచాయతీ వద్ద వి.రాజయ్య కే.రాజయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కరొన సమయంలో ప్రజలందరూ ఇండ్లకి పరిమితమైతే ప్రాణాలకు తెగించి పని చేసిన మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కార్మికులను దేవుళ్ళని పువ్వులు చల్లి సన్మానాలు చేస్తే సరిపోదని వారికి కనీస వేతనాలు పెం చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు పి ఆర్ సి ప్రకారం పెంచిన వేతనాలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన వేతనాలు జమ్మికుంట మున్సిపాలిటీ లోని ఇచ్చి మిగతా మున్సి పాలిటీల్లో ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. మున్సిపాలిటీ సిబ్బందికి కేటగిరీల వారీగా వేతనాలు పెంచా లన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాజేందర,్ రాష్ట్ర నాయకులు బండారి బాబు నాయకుల జంపయ్య, ఆశొక్, రాజన్న, సుధాకర్, రాజు, రజిత, సమ్మక్క, పద్మ, రాకేష్, రవీందర్, రాజేందర్ పాల్గొన్నారు.