Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండల పరిధి రాంపురం, మద్దివంచ గ్రామ పంచాయతీల్లో రాత్రి సమయంలో విద్యుత్ సరాఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్దలు పడుతున్నారని తక్షణమే విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర నాయకులు, వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సీపీఐ మండల కమిటీ అధ్వర్యంలో శుక్రవారం విద్యుత్‌శాఖ ఏఈ కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలల నుండి రాత్రి సమయంలో సుమారు మూడు గంటలపాటు విద్యుత్ సరాఫరా నిలిచి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షాకాల సీిజన్ కావడంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి రాంపురం, మద్దివంచ గ్రామ పంచాయితీల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. జంపాల వెంకన్న, పి.కోటి, వై.సాయి కుమార్, యశ్వంత్, మల్లయ్య తదితరులు ఉన్నారు.