Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోమలు ప్రబలి అనారోగ్యాల భారిన పడుతున్న దళిత కాలనీవాసులు
నవతెలంగాణ-శాయంపేట
శాయంపేట దళిత కాలనీలోని 14వ వార్డులో మురికి కాలువ నిర్మాణం కోసం జేసీబీతో కాలువ తీసి నిర్మాణం చేపట్టడం మరిచిపోయారని వైఎస్సార్ టిపి మండల అధ్యక్షులు మారపెల్లి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత కాలనీలో సమస్యలు తిష్ట వేసుకు కూర్చున్నా యని, స్థానిక సర్పంచ్ కె. రవి, జిపి పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కాల్వ నిర్మాణం కోసం కాల్వ తీసి వదిలివేయడం వల్ల నీరు నిలిచి దోమల ప్రబలి కాలనీవాసులు అనారోగ్యాల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీపి పాలకవర్గం, అధికారులు స్పందించి వెంటనే సైడ్ కాలువ నిర్మాణం చేపట్టి కాలనీ వాసుల కష్టాలు తొలగించాలని అన్నారు.