Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని గుండ్లపహాడ్ గ్రామ శివారు రాజన్న బోడ్ వద్ద స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్( రాష్ట్ర గిడ్డంగుల సంస్థ) ద్వారా 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోడలు మంజూరు కాగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిడ్డంగుల నిర్మాణం ఈ సంవత్సరంలోనే పూర్తిచేసి రైతులకు అందించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గుండ్లపహాడ్ నుండి మేడిపల్లి గ్రామం వరకు ప్రధానమంత్రి సడక్ యోజన నిధుల ద్వారా బిటి రోడ్డు మంజూరు చేశామని త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు వేస్తామన్నారు. గిడ్డంగుల నిర్మాణానికి స్థలాన్ని అందించిన స్థల దాత పడాల ప్రవీణ్ కుమార్ హైకోర్టు న్యాయవాదిని ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పవన్ కుమార్, ఎంపీపీ అడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వరరావు, పి ఏ సి ఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళి, ఆర్ఎస్ఎస్ మండల కోఆర్డినేటర్ గోనెల పద్మ నరహరి, సర్పంచులు గట్టయ్య, పద్మ, తిరుపతి, రాజారామ్, సురేష్, ఎంపీటీసీ అజ్మీరా లక్ష్మి, నాయకులు మోహన్ రెడ్డి ,సీతారాం రెడ్డి, చంద్రమౌళి, ఓదేలు, రవి, రాజిరెడ్డి, మోహన్, యూత్ నాయకులు వర్ణం నరసింహారెడ్డి, సురేష్, మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.